ఏవరీ హిడ్మా? ఛత్తీస్‌ఘడ్ ఎన్కౌంటరుకు ఈ హిడ్మాకి ఎమిటి సంబంధం?
ఛత్తీస్‌గఢ్ బీజాపుర్‌లోని అడవుల్లో భద్రతా దళాలపై జరిగిన భీకరదాడికి సూత్రధారి.. సుకుమా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందిన హిడ్మా
రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో చాలావరకు ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు అధిపతిగా ఉన్నట్లు తెలుస్తున్న హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు ఉంది.
ఛత్తీస్‌గఢ్ మావోయిస్టు పార్టీలో భారీ దాడులకు వ్యూహకర్తగా పేరున్న అతడు ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) నంబర్ 1 బెటాలియన్‌కు కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్జడ్సీ) సభ్యుడిగా ఉన్నాడు.
రెండు దశాబ్దాలుగా దండకారణ్యంలో జరిగిన భారీ దాడుల్లో చాలావరకు ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
మెరుపు వేగంతో దాడులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా పువర్తి ప్రాంతానికి చెందిన గిరిజనుడైన హిడ్మా, దాదాపు మూడు దశాబ్దాల క్రితమే మావోయిస్టు కమ్యూనిస్ట్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ)లో చేరాడు.
ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రమే పూర్తి చేసిన అతడు, మావోయిస్టు ఆపరేషన్లలో దిట్టగా పేరొందాడు.
యుద్ధ నైపుణ్య మెళకువలను కేడర్‌కు అలవోకగా నూరిపోస్తుంటాడని హిడ్మాకు పేరుంది.
కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహించే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎప్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు.
పార్టీలో పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ) విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుందని తెలుస్తుంది.