గుంటూరు జిల్లాలో తొలి పిడీ యాక్ట్ కేసు నమోదు
మద్యం అక్రమ రవాణా చేస్తున్న రామ కోటేశ్వరావు పై పీడి యాక్ట్ నమోదు చేసిన పోలీసులు
గుంటూరు జిల్లాలో తొలి పీడీ యాక్ట్ కేసు నమోదయింది. వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన రామకోటేశ్వరరావు పై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ ప్రకటించారు.
యరమాసు రామ కోటేశ్వరరావు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరా చేస్తున్నాడని అర్బన్ ఎస్పీ తెలిపారు. తెలంగాణ నుంచే కాకుండా గోవా నుంచి కూడా అక్రమ మద్యాన్ని రామ కోటేశ్వరరావు తరలిస్తున్నాడు.
లిక్కర్ అక్రమ రవాణా చేస్తూ మూడుసార్లు పోలీసులకు రామకోటేశ్వరరావు పట్టుబడ్డాడని ఆయన పేర్కొన్నారు. పీడీ యాక్ట్ అమలుకు కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం జీ.ఓ కూడా ఇచ్చిందన్నారు.
రామకోటేశ్వరరావు పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. రామ కోటేశ్వరరావును రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇదో హెచ్చరిక కావాలని అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ అన్నారు.