8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. దత్తన్న బదిలీ
దేశంలో 8 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించింది. గవర్నర్ బండారు దత్తాత్రేయకు స్థాన చలనం కలుగగా, ఏపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి వరించింది.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ అయ్యారు. మిజోరం గవర్నర్‌గా కంభంపాటి హరిబాబును నియామకం అయ్యారు.
మధ్యప్రదేశ్ గవర్నర్‌గా మంగూభాయ్ ఛగన్భాయ్ పటేల్, కర్నాటక గవర్నర్‌గా థావర్ చంద్ గెహ్లోత్, గోవా గవర్నర్‌గా పీఎస్ శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్ నారాయణ, జార్ఖండ్ రమేశ్ బైస్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ నియామకం అయ్యారు.