డోర్ డెలివరి కుదరదు దిక్కున్నచోట చెప్పుకోండి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటి ఇంటి కి డోర్ డెలివరీ పధకానికి తూట్లు పొడుస్తున్న క్షేత్ర స్థాయి సిబ్బంది.
కృష్ణాజిల్లా నందిగామ మండలం లింగాలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఇంటి ఇంటి కి డోర్ డెలివరీ పధకం కింద సరుకులను ప్రతి ఇంటికి సరఫరా చేయవలసిన క్షేత్ర స్థాయి సిబ్బంది ఈ పథకానికి తూట్లు పొడుస్తున్నారు.
ఇంటింటికి డోర్ డెలివరి ద్వారా సురుకులను సరఫరా చేయవలసిన సిబ్బంది ఒకే చోట తిష్టవేసుకుని సరుకులు కావలసిన వారు బండి వద్దకు వచ్చి తీసుకోవాలని బండి ఇంటింటికి తీసుకు రానని తెగేసి చెబుతున్నారు.
ఈ విషయమై స్థానికులు ప్రశ్నించగా, సదరు సిబ్బంది మీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు.
చేతనైతే జిల్లా కలెక్టరుకు, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఎంఆర్ఓకు ఇంక ఎవరికి చెప్పుకోగలవో చెప్పుకోమంటూ స్థానికులను బెదిరంచడం కొసమెరుపు.
సంబంధిత అధికారుల దృష్టికి ఇటువంటి సంఘటనలు తీసుకువెళ్లి ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ఫలాలు ప్రజలకు అందేలా చూడాలని స్ధానికులు కోరుకుంటున్నారు.
ఇటువంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.