టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కావాలా… విపక్షాలు చెబుతున్న అబద్ధాల మాటలు కావాలా… అనేది పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలి….. ఎమ్మెల్యే అరూరి….
ఐనవోలు మండలం పున్నెల్ గ్రామంలో నిర్వహించిన పున్నెల్, పెరుమాండ్లగూడెం గ్రామాల పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హజరయ్యారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టభద్రులు తెరాస పార్టీ వెంటే ఉన్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించి దేశంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు.
ఇక్కడి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయన్నారు. తెరాస పార్టీపై ప్రజలకు విశ్వసనీయత ఉందని అన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి బ్రహ్మాండమైన మద్దతు లభిస్తోందని చెప్పారు.
ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని సూచించారు.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లను గందరగోళంలోకి నెట్టేందుకు విపక్షాలు అబద్దపు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే అరూరి ధ్వజమెత్తారు.
వారి అబద్దపు మాటల మాయలో పడకుండా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డిని మరోసారి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు.
గడిచిన ఆరేండ్లుగా ప్రభుత్వానికి, పట్టభద్రులకు మధ్యన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వారధిగా పనిచేశారన్నారు.
అలాంటి అభ్యర్థిని గెలిపించుకుంటేనే పట్టభద్రుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.