బిడ్డకు పాలు ఇస్తుండగా…కాటేసిన పాము
కృష్ణా: బిడ్డకు పాలు ఇస్తుండగా తల్లిని పాము కాటేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు గంపలగూడెం మండలంలోని ఉటుకురు గ్రామానికి మిరప కోతకు వచ్చారు. ఈ క్రమంలో గత అర్ధరాత్రి పసి పాపకు పాలు ఇస్తున్న సమయంలో తల్లిని పాము కాటేసింది. పాముకాటుకు గురైన శృతి ప్రమోద్ భోయార్ను వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పాముకాటుకు గురైన రూపేష్ ప్రకాష్ చప్డే అనే మరో వలస కూలీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.