*కృష్ణాజిల్లా అడిషనల్ ఎస్పీ మల్లిక గర్గ్ కు ఎస్పీగా పదోన్నతి*
*ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ నియామకం*
★ ప్రకాశం జిల్లా పోలీస్ అధికారి నియామకం విషయంలో కొద్ది రోజులుగా అనేక పేర్లు వినిపించాయి.
★ అయితే రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ ని కృష్ణా జిల్లా ఎస్పీ గా నియమించగా ఆయన బాధ్యతలు సైతం స్వీకరించారు.
★ ఆయన స్థానంలో జిల్లా ఎ.ఎస్పీ చౌడేశ్వరి ని ఇంఛార్జి ఎస్పీగా నియమించారు.
★ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎట్టకేలకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఎవరు అనే చర్చకు తెర పడింది.
★ కృష్ణ జిల్లా ఎ.ఎస్పీ గా విధులు నిర్వహిస్తున్న మల్లికా గార్గ్ ని ప్రభుత్వం ప్రకాశం జిల్లా ఎస్పీ గా నియమించింది.
★ ప్రకాశం జిల్లా ఎస్పీ గా నియమితులైన మల్లికా గార్గ్ పశ్చిమ బెంగాల్ కి చెందిన పోలీస్ అధికారి.
★ మల్లికా గార్గ్ ప్రకాశం జిల్లాలో తొలి మహిళా ఎస్పీ గా చెప్పుకోవచ్చు.