అమరావతి (హైకోర్టు): ఏపీలో నరేగా పనులకు బిల్లులు చెల్లించకపోవడంపై హైకోర్టు సీరియస్
2018 నుంచి 2019 వరకు ఎన్ని పెండింగ్‌లో ఎన్ని బిల్లులు ఉన్నాయి, ఎంత మొత్తం చెల్లించాలో కోర్టుకు నివేదించాలన్న ధర్మాసనం.
కేంద్రం నుంచి డబ్బులు రాలేదని చెప్పిన ఏపీ ప్రభుత్వం.
కేంద్రం నుంచి ఆ ఏడాదికి డబ్బులు రాకపోతే తర్వాత సంవత్సరాలకు నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు.
ఐదు లక్షల బిల్లులను 20 శాతం తగ్గించి ఇస్తామని అఫిడవిట్ వేసి.. ఎందుకు ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.
రెండు వారాల్లోపు పూర్తిస్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు.
సరైన సమాధానం ఇవ్వకపోతే సీఎస్‌ను కోర్టుకు పిలిపిస్తామని హెచ్చరిక
ఏడు లక్షల పనులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్న పిటిషన్ల తరపు న్యాయవాది నర్రా శ్రీనివాస్.
కేంద్రం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని పిటిషనర్ల ఆరోపణ.
పూర్తిస్థాయి అఫిడవిట్ వెంటనే దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం.