కోరోనా వైరస్ విషయంలో అజాగ్రత్త తగదని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు.
తూర్పూ గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కరోనా కేసులు నమోదైన ప్రైవేట్ కళాశాల వసతిగృహాన్ని ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్ధుల పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
జిల్లా వైద్యాధికారులు అందరూ 24 గంటల పాటు అందుబాడులో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సీక్షిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించి సురక్షిత దూరం పాటిస్తూ కరోనా నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని మంత్రి కోరారు.
