పార్టీకి మనం తోడుగా నిలబడితే…. పార్టీ మనకు అండగా నిలబడుతుంది…..ఎమ్మెల్యే అరూరి…..
పార్టీ నిర్మాణానికి కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 46, 47 డివిజన్ల పార్టీ నాయకులు, కార్యకర్తలతో గోపాల్ పూర్ లో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ పాటిష్టానికి కార్యకర్తలే కీలకమని, బలమైన పార్టీ నిర్మాణానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని అన్నారు.
పార్టీ సభ్యత్వ నమోదులో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గెలుపు కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు.
ప్రతీ 20మంది ఓటర్లకు ఒక ఇంచార్జ్ ను నియమించుకొని ప్రతీ ఓటరుకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించి మొదటి ప్రాధాన్యత ఓటు టీఆరెఎస్ పార్టీ అభ్యర్థికి వేసేలా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సిరంగి సునీల్ కుమార్, నల్లా స్వరూప రాణి, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.