కోనసీమలో కరోనా విజృంభణ
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిగారి హెచ్చరిక..
జిల్లాలో మళ్ళీ ఇప్పుడు కరోన కేసులు పెరుగుతున్నాయి..
నిన్న ఒక్క రోజే 41 కేసులు వచ్చాయి..
బయట ప్రాంతాల్లో నుండి వచ్చిన వారి నుండి కేసులు పెరుగుతున్నాయి..
బయట నుండి వచ్చే వాళ్ళకి కనీసం కరోన లక్షణాలు ఉండటం లేదు..ఇది చాలా ప్రమాదం
ఎన్నికలకు వచ్చిన వారితో వచ్చి ఉండవచ్చు..
ముందు జాగ్రత్త గా 50 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు
కోనసీమలో ఎక్కువ కేసులు వస్తున్నాయి…ఆయా ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
గడచిన 24 గం.ల్లో జిల్లాలో 41 పాజిటివ్ కేసులు, అమలాపురం డివిజన్లో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..
అమలాపురం పట్టణంలో 5 పాజిటివ్ కేసులు నమోదు..
తూ.గో..అమలాపురంలో 5 కరోనా పాజిటివ్ కేసులు.
హైదరాబాద్ నుండి అమలాపురం కు వచ్చిన ముగ్గురికి కరోనా పాజిటివ్.
అమలాపురంలో ఒక మెడికల్ షాపు కు చెందినవారికి ఇద్దరికి కరోనా పాజిటివ్.
అమలాపురం 18 వార్డు భూపయ్య అగ్రహారంను రెడ్ జోన్‌గా ప్రకటించిన అధికారులు.
పాజిటివ్ వచ్చిన వారిని హోమ్ క్వారంటైన్ లో ఉంచిన అధికారులు..
జిల్లాలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు.