మనం బలపడాలంటే…
బీజేపీని బలపరచాల్సిందే…
జనసేన పార్టీ తరఫున ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంస్థాగతంగా బలపడేందుకే అనే విషయాన్ని గమనించాలని కార్యకర్తలకు పవన్ సూచించారు.
రాష్ట్రంలోని అరాచక శక్తులను ఎదుర్కొనేందుకే భాజపాతో కలిసి ముందుకు సాగుతున్నట్లు స్పష్టం చేశారు.
తిరుపతి పార్లమెంట్ సీటును బీజేపీకి వదలడం మంచి నిర్ణయమని అన్నారు.
కార్యకర్తలు దూరదృష్టితో ఆలోచించాలని కోరారు. దీనిపై లోతైన చర్చ జరిగింది అని చెప్పారు.