విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలంటూ ప్రధానికి మరోసారి జగన్ లేఖ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దంటూ ప్రధానికి మరోసారి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ లేఖ.
అఖిలపక్షంతో పాటు కలిసేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరిన జగన్.
ఇటీవల పార్లమెంటు సాక్షిగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నూరు శాతం ప్రైవెటీకరణ దిశగా ముందుకు సాగనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెసిన ప్రకటన తెలిసిందే. అయితే ఈ అంశంపై మరోమారు పునరాలోచన చేయవలసిందిగా కోరతూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రధాని మోదీకి లేఖ వ్రాశారు.
అనేక మంది ఆంధ్రుల నాడు చేసిన బలిదానాలకు నిదర్శనంగా ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నేడు పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం సమంజసం కాదని. విశాఖ ఉక్కు కర్మాగారంతో ఆంధ్ర ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉన్నదని ఆ అనుబంధాన్ని ప్రైవెటీకరణ పేరుతో తెంచివేయద్దని ఈ లేఖలో జగనే పేర్కొన్నారు.
ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దశాబ్ద కాలం అలుపెరుగని పోరాటం చేసి ఈ కర్మాగారాన్ని సాధించుకున్నారని “విశాక ఉక్కు ఆంధ్రుల హక్కు” అంటూ ఆనాడు చేశిన నినాదాలు నాటి ప్రధాని సైతం దిగివచ్చి ఉక్కు కర్మాగారం ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టేలా చేశాయని, ఇప్పుడు ప్రైవేటీకరణ పేరుతో ఆ పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రులకు దూరం చేయడం తగదని పేర్కొన్నారు.
ఈ కర్మాగారం ద్వరా ప్రత్యక్షంగా దాదపు 20వేల మందికి పరోక్షంగా మరెంతో మందికు ఉపాధి కల్పిస్తోందని ఈ లేఖలో ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.
అంతేగాక విశాఖ ఉక్కు కర్మాగారం భారతదేశంలో తీరం వెంబడి నిర్మించిన మొట్టమొదటి ఉక్కు కర్మాగారమని గుర్తు చేశారు.
నవరత్న హోదా గల విశాఖ ఉక్కు కర్మాగారం 2015 వరకు ఎలా లాభాల బాటలో కొనసాగిందో గుర్తు చేస్తూ ఆ తర్వత అంతర్జాతీయంగా ఉక్కు పరిశ్రమ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల కారణంగానే గత కొంత కాలంగా నష్టాలు చవి చూడవలసి వచ్చిందని పేర్కొన్నారు.
అంతేగాక ప్రస్తుతం ప్రతి నెల 200 కోట్ల మేర లాభాలను ఆర్జిస్తున్న అంశాన్ని కూడా ప్రస్థావించారు.
ముడి సరుకు ఎన్ఎండిసి నుండి ఖరీదు చేయడన పరిశ్రమపై పడుతున్న మరో భారమని, సెయిల్ వంటి ఇతరు ఉక్కు కర్మాగారాలకు ముడి ఉక్కు ఘనులు కేటాయించినట్లు విశాఖ కర్మాగారానికి కూడా కేటాయించినట్లైతే ముడి సరకుపై పడే భారం తగ్గి ఈ కర్మాగారం మరింత మెరుగైన పనితీరు ప్రదర్శించగలదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అంతేగాక విశాఖ ఉక్కు కర్మాగారానికి ఎంతో విలవైన వేల ఎకరాల భూములు ఉన్నాయని వాటిలో చాలా వరకు నిరుపయోగంగా ఉన్నాయని, వాటి విలువే దాదాపు లక్షకోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కర్మాగారాన్ని మరింతగా ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు అవసరమైతే ఆ భూములను ఇళ్ళ స్థలాలుగా మార్చి అమ్మవచ్చని అందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కావలసిన సహకారం అనుమతలు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలియ జేశారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయకుండా సంస్థను బలోపేతం చేసేందుకు గల అనేక అవకాశాలను సమగ్రంగా వివరించేందుకు అఖిలపక్ష కమిటీ మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమేతంగా కలిసేందకు ప్రధాని అపాయింట్మెంట్ కోరారు.



