బాధ్యతయుతమైన పౌరులుగా వైద్య సేవలు అందించి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి….
ఫిజియోధెరఫి కోర్సు పూర్తి చేసిన విధ్యార్ధులకు డిగ్రీ పట్టాలు అందజేసిన రాజానగరం ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రాజా గారు …
వైద్య రంగంలో బాధ్యతయుతమైన సేవలు అందించి సమాజనికి, దేశానికి మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావాలని రాజానగరం ఎమ్మెల్యే, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జక్కంపూడి రాజా గారు అన్నారు
శనివారం రాజానగరంలోని జిఎస్ఎల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్లో ఫిజియోధెరఫి కోర్సులో డిగ్రీ పూర్తి చేసిన విధ్యార్ధులకు డిగ్రీ పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006 సంవత్సరంలో జీఎస్ఎల్ కాలేజీలో తాను చదివిన రోజులను గుర్తు చేసుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారిని తన తండ్రి డాక్టర్ సీటు కోసం అడిగారని అన్నారు.
లెక్కలంటే ఇష్టమైన తాను నాన్న గారు, అమ్మమ్మల అభీష్టం మేరకు మెడిసిన్లో చేరినట్లు పేర్కొన్నారు.
డాక్టర్ డిగ్రీ పూర్తి చేయలేకపోయాననే అసంతృప్తి ఉందని తెలిపారు.
డాక్టర్ డిగ్రీ పూర్తి చేయలేక పొవడానికి నాన్నగారి ఆరోగ్యం, ఇతర కారణాలు వలన పూర్తి చేయలేకపోయినట్లు తెలిపారు.
అయినా దేవుని దయవలన డాక్టర్ డిగ్రీ పూర్తి చేయలేకపోయినా డాక్టర్లకు పట్టాలు ఇచ్చే స్థాయిలో నన్ను దేవుడు నిలబెట్టారని పేర్కొన్నారు.
ఎందరో డాక్టర్లు నయం చేయలేని వ్యాధులను ఫిజియోధెరఫిస్టులు నయం చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ఫిజియోధెరఫి డిగ్రీ పూర్తి చేసిన 74 మంది విధ్యార్ధులకు, యోగాలో డిగ్రీ పూర్తి చేసిన 62 మంది విధ్యార్ధులకు పట్టాలు పంపిణీ చేశారు.
ఈసందర్బంగా అత్యధిక మార్కులు సాధించిన విధ్యార్ధులకు గోల్డ్, బ్రాంజ్, సిల్వర్ మెడల్స్ ను ఎమ్మెల్యే గారి చేతులు మీదుగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిఎస్ఎల్ కళాశాల చైర్మన్ గన్ని భాస్కరరావు,.డాక్టర్ పి.అప్పారావు, డాక్టర్ కె.ఎం. అన్నమలై, డాక్టర్ ఎ.సురేష్ బాబు రెడ్డి, డాక్టర్ గన్ని సందీప్, వై.వి.శర్మ, టి.వి.ఎస్. మూర్తి, గన్ని సాదిక్, తదితరులు పాల్గొన్నారు.