తాడేపల్లి: మత్తులో జోగుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు…
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన!!!
గుర్తించ లేకపోయిన ఉపాద్యాయులు…
తాడేపల్లిలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు మత్తు పదార్థాలు సేవిస్తుండగా స్థానికులు గుర్తించి పాటశాల ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేశారు.
వైట్నర్ సొల్యూషన్, చేతి రుమాలులో చుట్టి పీలుస్తూ మత్తులో తూగుతున్న ఇద్దరు విద్యార్థులను గుర్తించిన స్ధానికులు ప్రధాన ఉపాధ్యాయుని ఎదుట హాజరు పెట్టారు.
అయితే మత్తులో తూగుతున్న విద్యార్థులను చూసిన ఉపాధ్యాయులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తుంది.
దీనితో ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి తల్లిదండ్రుల సమక్షంలో సదరు విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
మత్తు పదార్థాలు సేవించిన విద్యార్థులు చెప్పిన వివరాలు పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసాయి.
ఈ విధంగా తము మాత్రమే కాదని తమతో పాటు చాలామంది విద్యార్థులు ఇదే విధంగా మత్తు ఇచ్చే పదార్థాలు సేవిస్తున్నటట్లు వెల్లడించారు ఆ విద్యార్ధులు
ఎక్కువ మంది విద్యార్థులు మత్తులో జోగుతున్నా తమ దృష్టికి రాలేదని ప్రధాన ఉపాద్యాయులు చెప్పటం గమనార్హం….
కౌన్సెలింగ్ తోనే సరిపెట్టకుండా విద్యార్థులకు మత్తు ఇచ్చే పదార్థాలు ఎవరు విక్రయిస్తున్నారో విచారించాల్సిన అవసరం పోలీసులతోపాటు, ఉపాధ్యాయులకు సైతం ఎంతానా ఉంది.
ఇంకా ఎంత మంది విద్యార్థులు మత్తుకు అలవాటు పడ్డారో గుర్తించకపోతే, వారి బంగారు భవిష్యత్తు బుగ్గి పాలు అవుతుంది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులు, సామాజిక బాధ్యత కలిగిన వారందరు ముందుకు వచ్చి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తాడేపల్లి ప్రాంతంలో ఇప్పటికే అనేక మంది యువకులు గంజాయికి బానిసలుగా మారి తమ జీవితాలను పాడుచేసుకుంటున్నారు.
ఇటీవల పోలీసులు దాదాపుగా 50 మంది యువకులను విచారించడమే కాక, గంజాయి విక్రయిస్తూ, సేవిస్తున్న 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇలాంటి ఘటనలు మరువక ముందే పాఠశాల విద్యార్థులు మత్తులో జోగుతున్నారనే నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు తల్లిదండ్రులు.