చిత్తూరు: కానిపాకం వర సిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలోని కానిపాకంలో సుప్రసిద్ధ శ్రీ సిద్ది వినాయక స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న వినయ్ భాస్కర్.
పర్యటనలో భాగంగా వారికి కానిపాకం ఆలయ అధికారులు ఆర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు.
తదనంతరం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుని ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలపై ఎల్లవేళలా ఉండాలి అని కోరుకుంటున్నట్లు తెలిపారు.
స్వామి వారి అనుగ్రహముతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో నడిపిస్తూ బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతున్నారని తెలుపారు.
ఆలయ పరిసరా ప్రాంతాల్లో పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుతున్న కానిపాకం ఆలయ అధికారులను ఆర్చకులను సిబ్బందిని ఈ సందర్భంగా వారు అభినందించారు.