పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి-ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ఈ నెల 14న జరుగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఓటర్లను కోరారు.
సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పిఏపల్లి మండలం కోదండపురం వాటర్ ప్లాంట్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టభద్రుల సమస్యలపై ప్రఖ్యాత విద్యావేత్త డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంపూర్ణ అవగాహన ఉన్నదని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వం 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు.
ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన అన్నారు.
యువతకు ఉద్యోగాల కల్పన గురించి ప్రతిపక్షాల అసత్య, తప్పుడు ప్రచారాలు టీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు ఎప్పటికప్పుడు ఖండించాలని సూచించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి పట్టభద్రులకు వివరించి చైతన్యపర్చాలని సూచించారు.
ఎన్నికల నియమావళి కోడ్ ముగిసిన అనంతరం మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనుందని ఆయన భరోసా ఇచ్చారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మిన్నంటడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
గతంలో బ్యారెల్ ధర రూ.107 ఉన్నప్పటికీ పెట్రోల్,డీజిల్ ధరలు పెరగలేదని అన్నారు. ప్రస్తుతం బ్యారెల్ ధర రూ.57 ఉన్నప్పటికీ పెట్రోల్ ధర రూ.100 కు చేరుకుందని విమర్శించారు.
మోడీ సర్కారు అసమర్ధ పాలన కారణంగా చమురు ధరలపై నియంత్రణ లేకుండా పోయిందన్నారు.
కేంద్రం ఇటీవల 157 మెడికల్ కళాశాలలు మంజూరు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల మంజూరు చేయలేదని ఆయన విమర్శించారు.
తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామంగా మారిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా ప్రయివేట్ రంగంలో 14 లక్షల ఉద్యోగాలను ఆరేండ్లలో సృష్టించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దేనని అన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం తథ్యం అని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరేండ్లలో అరవై ఏండ్ల అభివృద్ధిని సాధించామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మిషన్ భగీరథ పథకం ద్వారా 45వేల చెరువులకు పునర్వైభవం వచ్చిందని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బీజేపీ ఓ వాట్సాప్ యూనివర్సిటీగా మారిందన్నారు.
నల్లగొండ జిల్లాను దశాబ్దాల నుంచి పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టామని అన్నారు. నల్లగొండ జిల్లాను సీఎం కేసీఆర్ ప్రగతి పథంలో నడిపిస్తున్నారని అన్నారు.
యాదాద్రి పవర్ ప్లాంట్, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్కు, మెడికల్ కళాశాలలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా కుగ్రామలకు కూడా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నామని అన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు.
ఒక్క విద్యుత్ శాఖలోనే 23వేల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.
టీఆర్ఎస్ సర్కారును అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్రపన్నాయని ఆరోపించారు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
2018లో ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవరకొండ నియోజకవర్గానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములను మంజూరు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని కేసీఆర్ నిలబెట్టుకున్నారని ఆయన గుర్తు చేశారు.
టీఆర్ఎస్ సర్కారు వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నదని అన్నారు.
అభివృద్ధి,సంక్షేమం తమకు జోడెడ్లలాంటివని భావించే సీఎం కేసీఆర్, తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తున్నారని అన్నారు.
యావత్ దేశానికే దిక్సూచిగా మారిన రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలకు తోడుగా బీడు భూములను సైతం సస్యశ్యామలంగా మార్చేందుకు కాళేశ్వరం లాంటి చారిత్రాత్మక ఆనకట్టలను నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు.
తెలంగాణ చరిత్ర పుఠల్లో, ప్రజల హృదయాల్లో ఆయన చిరకాలం చెరగని ముద్రగా నిలిచిపోతారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం కొనసాగుతోందని అన్నారు. ఉమ్మడి పాలకులు రైతుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కేసీఆర్ ముందుకు నడిపిస్తున్నారని అన్నారు.
అంగన్ వాడీ టీచర్ల జీతాన్ని రూ.4200 నుంచి రూ.10వేలకు, అంగన్ వాడీ ఆయాల జీతాన్ని రూ.2200 నుంచి రూ.6వేలకు, ఆశా వర్కర్ల జీతాన్ని రూ.1500 నుంచి రూ.7500కు, కాంట్రాక్టు లెక్చరర్ల జీతాన్ని రూ.31,050 నుంచి రూ.40,270, పాలిటెక్నీక్ లెక్చరర్ల జీతాన్ని రూ.28,500 నుంచి రూ.40,270, హోమ్ గార్డుల జీతాన్ని రూ.9 వేల నుంచి రూ.21వేలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు.
రానున్న రోజుల్లో నిరుద్యోగ భృతిని అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని భరోసా ఇచ్చారు.
పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ఉద్యోగాల ప్రమోషన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు మినహాయింపులు ఇచ్చిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందని అన్నారు.
ఖమ్మం జిల్లాలో ఐటీ టవర్ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. తద్వారా, ఖమ్మం జిల్లాలోని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం టాస్క్ ఏర్పాటు చేసిందన్నారు.
నల్లగొండ జిల్లాకు మూడు వైద్య కళాశాలల మంజూరులో కేసీఆర్ కృషి అద్వితీయమని అన్నారు. తిరుమలకు దీటుగా యాదాద్రి దివ్య క్షేత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునర్నిర్మిస్తున్నదని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వృద్ధి రేటును 14.2 శాతం సాధించామని అన్నారు. భారత్ లోనే ఆర్ధిక వృద్ధి రేటులో తెలంగాణ తృతీయ స్థానంలో ఉన్నదని అన్నారు.
కరోనా లాంటి క్లిష్ట సమయాల్లోనూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను కొనసాగించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. కరోనా కల్లోలం కారణంగా రాష్ట్రం 40,000 కోట్లు ఆదాయాన్ని నష్టపోయిందని అన్నారు.
రైతు మృతిచెందిన 5 రోజుల్లో రూ.5లక్షలు బీమా అందజేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటే అని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఉద్యోగుల జీతాలు 50 నుంచి 200 శాతం వరకు పెరిగాయని అన్నారు.
రాష్ట్రంలోని 24వేల వీఆర్ఏలను ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని, ప్రతీ రంగంలో ప్రభుత్వం ప్రగతిని సాధించిందని అన్నారు.
రైతులను సంఘటితం చేసేందుకు, రైతాంగ సమస్యలను చర్చించుకునేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 2604 రైతు వేడుకలను ప్రభుత్వం నిర్మిస్తున్నదని అన్నారు.
ఒక్కప్పుడు మహబూబ్ నగర్ జిల్లావాసులు ఉపాధి కోసం ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలకు తరలివెళ్ళేవారని అన్నారు.
అయితే, మహబూబ్ నగర్ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో వలసవెళ్లినవారంతా సొంతజిల్లాకు చేరుకుంటున్నారని అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రతీ కార్యకర్త గ్రాడ్యుయేట్ ఓటర్లకు వివరించి చైతన్యపర్చాలని కోరారు.
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
ఈ రెండు పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా, మార్గదర్శనంగా మారాయని అన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అన్నదాతల బలవన్మరణాలు ఆగిపోయాయని అన్నారు.
రైతును రాజును చేసేందుకు కేసీఆర్ తీసుకున్న చొరవను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తున్నదని అన్నారు.
రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ కు సంస్కరణల పేరిట కేంద్రం మోకాలడ్డు పెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన విమర్శించారు.
కేసీఆర్ పాలనలో గ్రామాల, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. గ్రామాల, పట్టణాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తోందని అన్నారు.
ప్రతీ గ్రామంలో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలను నిర్మిస్తున్నదని చెప్పారు. మున్సిపాలిటీల్లో, మున్సిపల్ కార్పోరేషన్ లలో మంత్రి కేటీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని అన్నారు.
నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారని అన్నారు. తద్వారా ఆడబిడ్డలకు రూ.1,00,116 మేనమామ కట్నం గా కేసీఆర్ అందజేస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది ప్రమాదవశాత్తు మృతిచెందిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరఫున నామినీలకు రూ.2 లక్షలు అందజేస్తున్నదని అన్నారు.
సర్కారు దవాఖానల్లో ప్రసవానికి వెళ్లిన గర్భిణీ మహిళలకు ప్రభుత్వం కిట్లు అందజేస్తున్నదని చెప్పారు.
ప్రతీ నిరుపేదకు కార్పోరేట్ వైద్యం అందించాలనే ధృఢ సంకల్పంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహకారం అందిస్తున్నదని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి, PACS చైర్మన్ వలపు రెడ్డి, ఎంపీటీసీ రాములు, అర్వపల్లి నర్సింహా, వైస్ చైర్మన్ శిరసనవడా శ్రీను, ఎర్ర యాదగిరి, వెంకట్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.