కేశవరం లో రోడ్ ప్రమాదం…
వ్యక్తి మృతి…
మండపేట:-మండపేట మండలం కేశవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలుపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
బిక్కవోలు మండలం తొస్సిపుడి గ్రామానికి చెందిన పెన్నింటి నాగేశ్వరరావు కడియం వైపు నుండి ద్వారపూడి వైపు వస్తుండగా ద్వారపూడి వైపు నుండి కడియం వైపు వెళుతున్న మరో మోటార్ సైక్లిస్ట్ ఇద్దరూ ఎదురెదురుగా ఢీకొన్నారు.
దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు 108 కి సమాచారం అందివ్వడంతో 108లో క్షతగాత్రుణ్ణి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మండపేట రూరల్ ఎస్.ఐ దొరరాజు తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
