
కృష్ణాజిల్లా: నూజివీడులోని ఒక గృహిణి అందజేసిన ఫిర్యాదు మేరకు నూజివీడులో గల “అమరావతి కో-ఆపరేటివ్ సొసైటీ” బ్యాంకు యాజమాన్యంపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు నూజివీడు డిఎస్పి బి.శ్రీనివాసులు తెలిపారు.

సదరు సంస్ధ వివిధ పథకాల పేర అనేక మంది ఖాతాదారుల నుండి చందాలు వసూలు చేసి కాల పరిమితి తీరిన తరువాత కూడా తమకు చెల్లించవలసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడం లేదని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.


బ్యాంకు నిర్వాహకులపై సెక్షన్ 406, 420, ఐపిసి సెక్షన్ 5, APPDFE యాక్ట్ 1999 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలియజేశారు.

కృష్ణా జిల్లా ఎస్పీ రవింద్ర బాబు ఆదేశాలమేరకు బ్యాంకు చైర్మన్తో పాటు డైరెక్టర్లను అదుపులోకి తీసుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ జరింపించనున్నట్లు తెలిపారు.
ప్రజలనుండి ఎన్ని లక్షలు డిపాజిట్లు సేకరించారో ప్రత్యేక బృందాలు దర్యాప్తు జరుపుతున్నాయని డిఎస్పి.శ్రీనివాసులు తెలియజేసారు.
