ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ కలిసిన ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన 711 మంది ఉద్యోగుల ప్రతినిధులు
తెలంగాణ ప్రభుత్వంలో తమ సర్వీసులను కొనసాగించేందుకు గానూ తమను రిలీవ్ చేయాలని సీఎం జగన్ కు ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.
వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ వారిని రిలీవ్ చేసేందుకు అంగీకారం తెలిపారు.
ఈ సందర్భంగా సొంతరాష్ట్రానికి వెళ్ళుతున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
