హైద్రాబాద్ నగర సివారు గ్రామాల్లో ఒకటైన మన్నెగూడ లో వెంచర్ వేయాలనుకున్నాడు ఒక స్థరాస్తి వ్యాపారి.
వెంచర్ పర్మిషన్ కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించాడు, అయితే ఇక్కడే గ్రామ సర్పంచే రంగ ప్రవేశం చేశాడు, తమ గ్రామంలో వెంచర్ వేయాలంటే తమకు సొమ్ములు చెల్లించాల్సిందే అంటూ లంచం డిమాండ్ చేశాడు.
ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వ్యవహారం తేలక పోవడంతో చేసేది లేక సదరు సర్పంచ్ డిమాండ్ చేసిన మొత్తం చెల్లించడానికి సిద్ధమయ్యాడు.
ఈ డబ్బును నగర శివారు బండ్లగూడ జాగీర్ పరిధిలో గల ఆరె మైసమ్మ దేవాలయం వద్దకు తీసుకువచ్చి అప్పగించాలని సదరు సర్పంచ్ ఆ స్థిరాస్థి వ్యాపారికి సూచించాడు.
చెప్పిన విధంగానే కారులో అక్కడికి చేరుకున్న బాధితుడు సర్పంచుకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
సరిగ్గా అదే సమయంలో కారులో 13 లక్షల రూపాయలు లంచం పుచ్చుకుంటుండగా సర్పంచును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.
ఈ విషయమై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.