కర్నూలు జిల్లా.. సతీ సమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారులను దర్శించుకున్న… ఏ పి ఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ పి. ఠాకూర్ గారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం ఏ పి ఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మెన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్. పి. ఠాకూర్ గారు సతీ సమేతంగా శ్రీశైలం చేరుకున్నారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.
ఆర్. పి. ఠాకూర్ గారు సతీ సమేతంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారులను దర్శించుకున్నారు. వేదపండితులచే వేద మంత్రాలతో ఆశ్వీరచనాలను అందుకున్నారు.
ఆర్ పి. ఠాకూర్ గారి వెంట జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ జి. మధుసుధన్ రావు, ఆత్మకూరు డిఎస్పీ శ్రీమతి శృతి గారు మరియు సిఐలు ఉన్నారు.