వరంగల్ పోలీసు కమిషనరేట్
మాస్క్ ధరించకుంటే చర్యలు తప్పవు
-వరంగల్ పోలీస్ కమిషనర్ పి. ప్రమోద కుమార్
మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే వారిపై చర్యలు తప్పవని ప్రజలను హెచ్చరించిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య అధికమవుతున్న క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు తప్పక మాస్కులను ధరించాల్సి వుంటుందని పేర్కొన్నారు.
కరోనా సెకండ్ వేవ్ క్రమంలో కొన్ని రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి.
ఈ కరోనా వ్యాధిని నియంత్రించడం కేవలం మాస్క్ ద్వారా సాధ్యపడుతుందని, కావున ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మలను ధరించాల్సి వుంటుంది.
ఎవరైన వ్యక్తులు మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినట్లయితే వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షన్లు, 188 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం సదరు వ్యక్తులపై తీసుకునే చర్యల్లో భాగంగా జరిమానాలను విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ నిబంధనలు ఏప్రిల్ 30వ తేది వరకు అమలులో వుంటుంది.
ముఖ్యంగా కరోనా వ్యాధి ప్రభావాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు తమవంతు సహకారం అందిచాల్సి వుంటుందని ఆయన తెలియజేశారు.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నమోదయ్యే కరోనా కేసులపై దృష్టి సారిస్తూ, పోలీస్ పరంగా అప్రమత్తంగా వ్యవహరించడం జరుగుతోందని, ఇందుకు అనుగుణంగా అనుమతులు లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, నిర్వహించవద్దని, ప్రజలు గుంపులగా నీలవద్దని, వివిధ పండుగలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఈ అంక్షలు వర్తిస్తాయని పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన తెలియజేసారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరాన్ని పాటిస్తూ, వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యపడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.