వరంగల్ పశ్చిమంలో ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ భాస్కర్ డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ డివిజన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ సిరిమల్లె సదానందం ఆదేశాల మేరకు డివిజన్ పర్యటన…
అత్యధిక మెజారిటీతో పల్లా గెలుపు ఖాయం…. కూచన సునీల్
ఓటు అడిగే హక్కు బిజెపికి లేదు.. కూచన సునీల్
వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని కూచన సునీల్ అన్నారు.
బుధవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 41వ డివిజన్ 3-7, 3-8 బ్లాక్ ల లో డివిజన్ మాజీ అధ్యక్షులు సిద్ధం శెట్టి శ్రీనివాస్ కూచన సునీల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డివిజన్ లో పలు కాలనీలని పర్యటిస్తూ పట్టభద్రులను కలుస్తూ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా కూచన సునీల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగులు ప్రధానంగా నిలిచారన్నారు.
బిజెపి నాయకుల కుట్రపూరిత రాజకీయాలు ఎక్కడా చెల్లవన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని త్వరలోనే బీజేపీ కోలుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి ఏంచేసారని బిజెపి వాళ్ళు ఓట్లడుగుతారని ప్రశ్నించారు.
ఏడేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేమిలేదన్నారు.
రాష్ట్రానికి వచ్చే నిధులు ఇతర రాష్ట్రాలకు తరలించిన ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
కేంద్రంలో మోదీ గారితో నిధుల గురించి మాట్లాడే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు లేదని, దేశాన్ని అమ్మకానికి పెట్టింది నరేంద్ర మోదీ గారు అని ఆయన విమర్శించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయమని, మెజారిటి కోసమే ప్రయత్నం అన్నారు.
ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ ఖాజా సిరాజుద్దీన్ పాల్గొన్నారు మరియు డివిజన్ అధ్యక్షులు పానుగంటి శ్రీధర్ ,ఎమ్మెల్సీ ఎన్నికల డివిజన్ ఇంచార్జ్ సిరిమల్లె సదానందం, పులి విక్రమ్, కొమాకుల ప్రశాంత్, దేవులపల్లి ప్రదీప్ భవాని మధు తదితరులు పాల్గొన్నారు.