12 గ్రామాల ఆఫీస్ బేరర్లకు మంత్రి కేటీఆర్ అభినందనలు
తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో అభివృద్ధి సాధించిన పంచాయతీలకు అవార్డుల పంట పండటంతో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
2019-20 సంవత్సరానికి గాను కేంద్రం ప్రకటించిన దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సశక్తికిరణ్ పురస్కారాల్లో తెలంగాణ రాష్ట్రానికి 12 అవార్డులు లభించాయి.
ఈ అవార్డులు పొందిన 12 గ్రామపంచాయతీల ఆఫీస్ బేరర్లను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.
పల్లెప్రగతి కార్యక్రమం సీఎం కేసీఆర్ మనసులో నుంచి పుట్టిన ఆలోచన.. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఆ శాఖ అధికారులు పల్లె ప్రగతి అమలు కోసం చేసిన కృషి వల్లే ఈ అవార్డులు వచ్చాయని కేటీఆర్ కొనియాడారు.
