ఆధ్యాత్మిక భావన పెంపులో బ్రహ్మకుమారిస్ సేవలు అభినందనీయం -ఎంపీ సత్యవతి.
విశాఖపట్నం అనకాపల్లి:- గవరపాలెంలో ఓంశాంతి బ్రహ్మ కుమారీస్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన బాబా గారి 85వ వార్షికోత్సవ వేడుకల్లో పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శ్రీమతి భీశెట్టి వెంకట సత్యవతమ్మ, డాక్టర్ విష్ణు మూర్తి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 125 దేశాల్లో బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విశ్వవిద్యాలయం ద్వారా మనుషుల్లో మానసిక ప్రశాంతతను పెంచేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
సైన్స్ అభివృద్ధి చెందినా భగవంతుడనే విశ్వవ్యాప్త శక్తికి ఏది అతీతం కాదు అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి శివలీల అక్కయ్య, బ్రహ్మకుమారి విద్య అక్కయ్య, తదితరులు పాల్గొన్నారు.
