అనధికార లేఔట్ ల పై చర్యలు ఎక్కడ…
విశాఖపట్నం:– పట్టణ వ్యాప్తంగా ఇష్టానుసారంగా లేఔట్ లు అనాధికారకంగా వేస్తున్న అధికారులు పట్టించుకోకుండా వదిలేయడం కొందరికి వరంగా మారింది.
ముఖ్యంగా గవరపాలెం ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు బెల్లం వర్తకులు తమ ఆర్ధిక బలానికి తోడు ఒక మాజీమంత్రి అండ తోడవడంతో సదరు మాజీ మంత్రిగారి కుమారుడు సహకారంతో యథేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడుతూ ఇష్టానుసారంగా అక్రమ లే ఔట్ లు వేస్తూ కోట్లు గడిస్తున్నారు…
శంకర్ థియేటర్ వద్ద గల వేద పాఠశాలలకు చెందిన భూములను సైతం ఇదే దుర్గతి పట్టింది, ఈ భూబకాసరుల కన్ను ఆ భూములపై పడటంతో వాటిని కూడా ఆక్రమించుకుని అనధికారిక లేఔట్ లు వేసి కోట్లు గడించారు..
అలా గడించిన వారిలో స్థానికంగా ఉన్న బడా వ్యాపారవేత్తల పేర్లే వినబడుతున్నాయి, వారి కన్ను పడితే చాలు ఎలాంటి భూమైనా సరే, సదరు భూమి లోకి యజమానులు వెళ్లకుండా దారిపొడనునా గోతులు తవ్వి సదరు భూ యజమాని భూమిలోకి వెళ్లకుండా అడ్డుకుంటారు.
ఇంకేముంది, సదరు యజమాని తన భూమిలోకి వళ్ళాలంటే ఈ భూబకాసరులు డిమాండ్ చేసినంత సొమ్ములు ముట్ట చెప్పాల్సిందే, చెల్లించే వరకు వదలరు మరి.
ఈ విధంగా ఈ కబ్జాకోరుల ఆదాయం ఇప్పటి వరకు కోట్లలోనే ఉన్నట్లు ఉంటుందని అంచనా…
ఈ అక్రమార్కులకు ఎప్పుడు చెక్ పడుతుందో అని సామాన్య ప్రజానీకం ఎదురుచూస్తున్న తరుణంలో జై అనకాపల్లి సేన అధ్యక్షుడు కొణతాల సీతారాం వీరి అండగా వచ్చాడు.
సదరు కబ్జాదారులు ఇటీవలే సీతారం విషయంలో కూడా ఇలాంటి అడ్డంకులే సృష్టించారు, ఆ సందర్భంలోనే ఈ కబ్జాదారుల ఆగడాలు తన ఒక్కడితోనే కాక అనేక మందిని ఇదే విధంగా వేధించిన విషయం గ్రహించిన సీతారాం ఆ బాధితులకు అందరికీ అండగా నిలిచారు.
వాస్తవానికి తనకు ఉన్న అడ్డంకులను తొలగించుకోవడం సీతారాంకు ఏమంత కష్టం కాకపోయినా, ఎటువంటి అండదండలు లేని సామాన్య ప్రజలకు ఇలాంటి ఇబ్బందుల్లో అండగా నిలవాలన్నకృత నిశ్చయంతో రంగంలోకి దిగారు.
శనివారం పట్టణ పోలీస్ స్టేషన్లో చట్ట ప్రకారం ఫిర్యాదు చేసి తదుపరి కమీషనర్ ను కలిసి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
సీతారాం చూపుతున్న ఈ చొరవను హర్షిస్తున్న బాధిత ప్రజలు జై సీతారాం, జైజై సీతారం అంటున్నారు.