మంత్రి గంగుల కమలాకర్ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయానికి అభినందనలు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలు
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల పార్టీ ఇంచార్జీగా మంత్రి గారి వ్యూహాలు ఫలించాయి
ఉద్యోగ సంఘాలకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి గంగుల
త్వరలోనే ఉద్యోగుల అన్ని సమస్యలను గౌరవ ముఖ్యమంత్రిగారు పరిష్కరిస్తారు-గంగుల
రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం పట్ల ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ జిల్లా పార్టీ ఇంచార్జిగా పనిచేసిన మంత్రి గంగుల కమలాకర్ని ఆయన నివాసంలో కలిసి వారు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సహకరించిన ఉద్యోగ సంఘాలకు క్రుతజ్ణతలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ వెంట నిలిచిన ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని, ముఖ్యమంత్రి ద్రుష్టికి మీ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి వాటి పరిష్కారానిక క్రుషిచేస్తామన్నారు మంత్రి గంగుల.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగ సంఘాల అద్యక్షుడు స్థితప్రజ్ణ, టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అద్యక్షుడు ముజీబ్ హుస్సెన్తో పాటు పలు సంఘాల ప్రతినిదులు పాల్గొన్నారు.