అనంతపురం జిల్లా కలెక్టరు గంధం చంద్రుడు మీద ధర్మవరం MLA కేతిరెడ్డి చేసిన అవమానకర మరియు అనుచిత వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ SC ,ST, ఉద్యోగుల సేవల సంఘము తీవ్రంగా ఖండించింది.
ఒక జిల్లా పరిపాలనాధికారిపై తీవ్రమైన విధంగా మనోభావాలు దెబ్బ తీసేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ SC, ST, ఉద్యోగుల సేవల సంఘం డిమాండ్ చేసింది.
జిల్లా మేజిస్ట్రేట్ కే రక్షణ లేకపోతే, ఇక రెవిన్యూ అధికారులకు రక్షణ ఎలా దొరుకుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.
కలెక్టర్ కు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని అవసరమైతే జాతీయ ఎస్సీ కమీషన్ను సైతం అనంతపురం రప్పిస్తామని వారు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జి. మధుసూదనరావు, రాయలసీమ జోనల్ ఇంచార్జ్ A. నిత్యానంద రాజు, రాష్ట్ర ప్రధానకార్యదర్శి గిరీష్ మొలతాటి పాల్గొన్నారు.