మండపేట:- ధన రాజకీయాలు శాసించే మండపేట గెలుపు ఓటములని మండపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు తన రాజకీయ చతురతతో మలుపు తిప్పారు.

మునిసిపాలిటీని కైవసం చేసుకొని చరిత్ర తిరగ రాసారు.
మండపేటలో ఆయన అడుగు పెట్టింది మొదలు తనదైన శైలిలో వ్యూహం పన్నారు.
పంచాయతీల్లో ఆధిక్యం సాధించారు.
ఇక 1987 లో కాంగ్రెస్ అభ్యర్థి బిక్కిన విజయ చైర్మన్ కాగా అనంతరం 1995, 2000, 2005, 2014 వరసగా టీడీపీ మండపేట పురపాలక సంఘంను ఏలి కంచుకోటను నిర్మించింది.
ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోతే భాద్యులైన తోటను ఇక్కడ నుండి పంపించే ప్రయత్నం కొందరు ఆరంభిచారు.
ఈ అన్ని ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నికల రణరంగలోకి తోట అడుగు వేశారు.
మునిసిపాలిటీని కైవసం చేసుకొనేందుకు 30 వార్డుల్లో ఇన్ఛార్జ్ లు నియమించారు. వారితో వార్డుల్లో కధ నడిపించారు.
దీని ఫలితం అనూహ్య గెలుపు. 12 వ వార్డు లో టీడీపీ చైర్మన్ అభ్యర్థి గడి సత్యవతి పోటీలో ఉండగా అక్కడ తోట ముఖ్య అనుచరులు పప్పుల మసేను వెంకన్న(రేవు శ్రీను) ను ఇన్ ఛార్జ్ గా నియమించారు.
అక్కడ టీడీపీ చైర్మన్ అభ్యర్థిని వ్యూహాత్మకంగా ఓడించారు.
ఇందులో రేవు శ్రీను కీలక పాత్ర పోషించారు.
ఇక 15 వ వార్డులో సీనియర్ టీడీపీ నేత మేకా శ్రీను ను ఏకంగా 545 ఓట్లు భారీ మెజార్టీ తో ఓడించారు.
ఇక్కడ తోట సమీప బంధువు తోట బబుల్ ఇన్ ఛార్జ్ గా పని చేసారు.
20 వ వార్డు లో వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థి పతి వాడ నుక దుర్గా రాణి పోటీ చేయగా తోట అనుచరుడు కుమార్ ను ఇక్కడ నియమించారు.
27 వ వార్డు టీడీపీ కి కంచుకోట. అలాంటి వార్డు లో తోట ప్రధాన అనుచరులు సయ్యద్ రబ్బానీ ని నియమించారు.
ఇలా ప్రతి వార్డు లోను తోట ముద్ర కనిపించింది. ఆయన వ్యూహం ఫలించింది.
ఇక 1 నుండి 10 వార్డుల్లో నాలుగు స్థానాలు గెలిచి మిశ్రమ పలితాలు రాగా 11 నుండి 20 వరకు ఏక పక్షం గా తొమ్మిది వార్డులు, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నివసించే 22 నుండి 30 వరకు వరస గా తొమ్మిది వార్డులు గెలుపొంది ఎక్కడా టీడీపీ కి అవకాశం ఇవ్వలేదు.
దీంతో 22 వార్డుల్లో విజయకేతనం ఎగురవేశారు.
ఈ నెల 18 న జరిగే చైర్మన్ ఎన్నిక కేవలం లాంఛనమే.
ముందుగా ప్రకటించిన విధంగా రాణి కే పట్టం కట్టనున్నారు.