గజల్ శ్రీనివాస్‌ను హిందూ ఆచార్య సభకు కార్య నిర్వాహక అధ్యక్షుడుగా నియమించిన శ్రీ మధురై ఆధీనం స్వామి వారు
త్రివేండ్రం: ప్రఖ్యాత గాయకుడు, సేవ్ టెంపుల్స్ భారత్ వ్యవస్థాపకులు డా. గజల్ శ్రీనివాస్ హిందూ ఆచార్య సభకు కార్య నిర్వాహక అధ్యక్షుడు గా నియమితులయ్యారు.
ఈ మేరకు నియామక పత్రాన్ని సంస్థ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ మధురై అధీనం తిరుంజన సంబంధ దేశికేంద్ర పరమాచార్య స్వామి వారు మధురై అధీనమ్లో అందచేసినట్లు సంస్థ కార్యదర్శి శ్రీ శ్రీ సౌపర్ణికా విజయేంద్రపురి, శంకర పీఠ అధీనం, కొల్లమ్, కేరళ తెలిపారు.
డా. శ్రీనివాస్ సంస్థ ఆశయాలను అనేక దేశాలలో ప్రచారం చేస్తారని, సనాతనధర్మ వ్యాప్తి, హిందూ ఆచార్య సభ గురుకుల్ విద్యాలయాల స్థాపనకు కృషి చేస్తారని తెలిపారు.