వైకాపా బలోపేతం…
కోళ్ళ శ్రీనివాస్ వైసీపీలో చేరిక…
మండపేట: మండపేట లో వైస్సార్ సిపి బలం పుంజుకుందని ఈ ఎన్నికల్లో మునిసిపాలిటీ కైవసం చేసుకొని వైకాపా జెండా ఎగురవేస్తామని మండపేట నియోజకవర్గ వైస్సార్ సిపి ఇన్ ఛార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు.
పట్టణానికి చెందిన యువ నాయకుడు కోళ్ళ శ్రీనివాస్ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. వైఎస్సార్సీపీ ఇన్ చార్జి తోట త్రిమూర్తులు సమక్షంలో ఆయన తన అనుచరులతో వైసీపీ కండువా కప్పుకున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా 26వ వార్డులో తోట త్రిమూర్తులు నిర్వహించిన సభలో కోళ్ళ శ్రీను ఫ్రెండ్స్ ను ఆయన సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు వేశారు.
ఈ సందర్భంగా తోట త్రిమూర్తులు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారంతా మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు ఎంతో సంతృప్తి కరంగా ఉన్నారన్నారు.
పట్టణ ప్రజలంతా మున్సిపాలిటీకి వైసీపీ నాయకత్వాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు. ప్రజల్లో వైసీపీకి వస్తున్న విశేషమైన స్పందన, ఆదరణతో కచ్చితంగా పురపాలక సంఘంపై వైసీపీ జెండా ఎగురవేస్తామని తోట ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తోట తనయుడు పృద్విరాజ్, జిల్లా మైనారిటీ కార్యదర్శి సయ్యద్ రబ్బానీ ,రెడ్డి రాజబాబు, జిన్నూరి సాయిబాబా, చైర్పర్సన్అభ్యర్థి పతివాడ దుర్గారాణి, టౌన్ ప్రెసిడెంట్ ముమ్మిడివరపు బాపిరాజు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, వంగా శ్రీను, కంఠంశెట్టి సత్తిబాబు, మీగడ శ్రీనివాస్, గంగుమల్ల శ్రీనివాస్, సయ్యద్ మైనర్ బాబు, అధికారి శ్రీనివాస్, 26వ వార్డు అభ్యర్థి ఆమలదాసు లక్ష్మీ, 2వ వార్డు అభ్యర్థి చిట్టూరి సతీష్, తోట బాబులు, పెమ్మిరెడ్డి మురళి తదితర నాయకులు పాల్గొన్నారు.
పార్టీలో చేరిన వారిలో కోళ్ళ శ్రీను, కోళ్ళ రాజా, కోళ్ళ క్రుపారావు, కోళ్ళ సత్యనారాయణ, పొలమూరి చినసుబ్బారావు, యడ్ల అర్జున్, కిలపర్తి మణికంఠ, బండారు ప్రసాద్, బండారు రమేష్, బండారు శ్రీను, పల్లి మణికంఠ, మీసాల దుర్గారావు, కోడూరి మణికంఠ, వాతా గణేష్, రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.