డిప్యూటీ సీఎం మంత్రి ధర్మాన కృష్ణదాస్ క్యాంపు కార్యాలయానికి సెలవు
శ్రీకాకుళం, ఏప్రిల్ 22 : కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నందున పోలాకి మండలం మబగాంలో డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన కృష్ణదాస్ క్యాంపు కార్యాలయానికి వారం రోజులు సెలవు ప్రకటించినట్టు కార్యాలయవర్గాలు తెలిపాయి.
డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఆయన తనయుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యలు అందుబాటులో ఉండడం లేదని సందర్శకులు ఎవైనా అత్యవసరమైన పని ఉంటే వ్యక్తిగత కార్యదర్శులు గొoడు మురళి (9490104334), రామ్మోహనరావు (9948312896), లక్ష్మణరావు (9133883733)లను ఫోన్ ద్వారా సంప్రదించాలని కోరారు.
అత్యవసర పనుల నిమిత్తం వచ్చేవారు నరసన్నపేటలోని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య వీరిని సంప్రదించవచ్చని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
సందర్శకులు కోవిడ్ నియమ నిబంధనలు కచ్చితంగా పాటించి తీరాలని స్పష్టం చేశాయి.
ఎస్.ఎం.ఎస్. మర్చిపోవద్దు: డిప్యూటీ సీఎం కృష్ణదాస్ :
జిల్లాలో రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ కి అడ్డుకట్ట వేయాలంటే సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్‌ని (ఎస్.ఎం.ఎస్) ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు.
కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుని కరోనా వైరస్ బారీన పడకుండా ఉండాలంటే ఎవరికివారే వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్వీయ నియంత్రణ మాత్రమే కరోనాకు మందు అనే విషయాన్ని కచ్చితంగా గుర్తించుకోవాలని చెప్పారు.
పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అంతా వినియోగించుకోవాలని కృష్ణదాస్ సూచించారు.