అరకులోయలో మెగా వాలీబాల్ టోర్నమెంట్
అరకులోయ నియోజకవర్గం స్థాయిలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో, మూడు రోజుల పాటు వైయస్సార్ మెగా వాలీబాల్ టోర్నీ నిర్వహించనున్నారు.
అరకులోయ వాలీబాల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు అరుకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ తెలిపారు.
ఈ సమయంలో క్రీడాకారులకు మూడు రోజుల పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.
ఆసక్తి గల క్రీడాకారులు మరిన్ని వివరాలకు 7382653262, 9441542733, 9490708845, నెంబర్ లకు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రూ. 30,000/-, రెండవ బహుమతి రూ.20,000/-, మూడవ బహుమతి రూ. 10,000/- అందజేయనున్నట్లు తెలిపారు.
