
కేంద్రపభ్రుత్వ సూచనల మేరకు టీకాల పంపిణీ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై అమరావతిలో వైద్యారోగ్యశాఖ అధికారులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ సచివాలయ స్థాయిలో టీకా పంపిణీకి పణ్రాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
నాలుగు, ఐదు వారాల్లో కోటి మందికి కోవిడ్ వ్యాక్సిన్స్ ఇవ్వాలని చెప్పారు.
ఎన్నికలు పూర్తయినందున వచ్చే సోమవారం నుంచి పట్టణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా మండలంలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 2 గ్రామాలు చొప్పున వ్యాక్సిన్ పక్ర్రియ పూర్తి చెయ్యాలని పేర్కొన్నారు.
లోపాలు సరిదిద్దిన తర్వాత విస్తృతస్థాయిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
