కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఘంటసాల గ్రామానికి చెందిన గ్రామ వలంటీరు ఉద్దంటి జగన్మోహన్ రావు అదే గ్రామానికి చెందిన మరో యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఆ ప్రేమను మూడు ముళ్ళ బంధంగా మార్చుకోవాలనుకున్న ఆ ఇద్దరు తమ ప్రేమను పెద్దలు అంగీకరించరని అర్ధం చేసుకున్నారు.
చేసేదేంలేక ఇద్దరు శనివారం నాడు పెళ్ళి చేసుకున్నారు. అయితే తమకు పెద్దల నుండి తమ తల్లిదండ్లుల నుండి ప్రాణ హాని ఉన్నట్లు పేర్కొంటు జిల్లా ఎస్పీ ని కలసి, ఇరువురికీ రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు.