అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వేటపాలెంలో వాసవీ పరివార్ ఇంటర్నేషనల్, యూత్ పరివార్ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అమరజీవి విగ్రహానికి పుష్పమాలంకరణ చేసి వారి త్యాగాలు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీ వంకా శ్రీనివాసరావు, కార్యదర్శి గొడవర్తి రామకృష్ణ, కోశాధికారి మరియు పంచాయతీ సభ్యులు శ్రీ ఊటుకూరి కోటిస్వామి గుప్తా గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా యువ శక్తి విభాగం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ ప్రత్తి వెంకట సుబ్బారావు గారు పాల్గొన్నారు.
వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరజీవి శ్రీరాములు గారు మహాత్మా గాంధీ, స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రేరోపితులు అయ్యి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైల్ కి వెళ్ళటం జరిగినదని తెలిపారు.
హరిజనుల ఆలయ ప్రవేశానికి వారు చేసిన పోరాటంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది, గాంధీజీ మెప్పు పొంది సభర్మతి ఆశ్రమం నిర్వాహకులుగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు.
తదుపరి మాహిళలకు విద్యా అవకాశం కల్పించాలని ఉద్యమించారు. తదుపరి మద్రాస్ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటుకు 51రోజులు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అశువులు బాసినారు.
వారి త్యాగ ఫలితంగా ఏర్పడినదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారి జయంతి కార్యక్రమం చేయాలని నిర్ణయం ఆనందాయకం గా ఉన్నది అని ,ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.
గత పాలకులు అమరజీవి త్యాగాలను పరిగణలోకి తీసుకోలేదు. కీర్తి శేషులు రాజశేఖరరెడ్డి గారు అమరజీవి త్యాగాలును గుర్తించి నెల్లూరు జిల్లాకు, అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సభ్యులు ప్రత్తి శరత్ బాబు, వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు దొగుపర్తి శ్రీనివాస్, కొత్త శ్రీనివాసు, లక్ష్మణ స్వామి, వనితా వైష్ణవి క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి చుండూరి గాయత్రి గారి ఆధ్వర్యంలో లో సునీత గారు, గొడవర్తి అంబికా గారు, గోనుగుంట్ల కల్పన గార్లు కూడా శ్రీ అమరజీవి జయంతి కార్యక్రమం నిర్వహించారు.
ఆర్యవైశ్యులు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ ప్రసాద రావు తదితరులు పాల్గొని విగ్రహానికి పుష్పమాలంకరణలు చేశారు.
తదుపరి జరిగిన ఐక్య సమావేశంలో అనేక మంది పాల్గొని, సమావేశంలో స్వీట్స్ పంపిణీ చేశారు వనితా వైష్ణవి క్లబ్ వారు వాసవి లెజెండ్స్ అధ్యక్షులు రామలింగేశ్వర రావు గారు, వాసవి క్లబ్ గవర్నర్ దొగుపర్తి బాలకృష్ణ గారు, వేటపాలెం ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్ కమిటీ కన్వీనర్ శ్రీ దుగ్గి రామచంద్ర రావు, ఊటుకూరి సుబ్బయ్యపాలెం మాజీ సర్పంచి రాములు గారు, పట్టభద్రుల సంఘం సభ్యులు రావి మస్తానరెడ్డి, అబ్రహం, షేక్ మునీర్ గారు తదితరులు పాల్గొన్నారు.