వైసీపీ సీటు దక్కలేదని ఆత్మహత్యాయత్నం చేసిన కార్యకర్త సవరపు సతీష్ ను పరామర్శించిన తోట త్రిమూర్తులు..
మండపేట: తనకు వైసీపీ సీటు దక్కలేదని మనస్తాపం చెంది పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ కార్యకర్త సవరపు సతీష్ ను మండపేట అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జి తోట త్రిమూర్తులు పరామర్శించారు.
రాయవరంలో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సతీష్ ను ఆయన గురువారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
సమస్య ఏదైనా ఉంటే తనతో చెబితే పరిష్కరిస్తాను కదా ఎందుకీ తొందర పాటు నిర్ణయం తీసుకున్నావు అని ఓదార్చారు.
అంతేగాక సతీష్ కు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉన్నాను అని భరోసా ఇచ్చారు.
సతీష్ ను ధైర్యంగా ఉండాలని అంతేగానీ ఇలాంటి పనులు చేస్తే వెనక కుటుంబ సభ్యులు ఉన్నారని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
పార్టీలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమని, కష్ట పడి పనిచేసే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
త్వరలో సతీష్ కు సముచిత స్థానం కల్పిస్తానని మాట ఇచ్చారు.
పరిస్థితులు అన్నీ చక్కదిద్దే బాధ్యత తనదే అని తోట త్రిమూర్తులు హామీ ఇవ్వడంతో సతీష్ ఆనందం వ్యక్తం చేశారు.