టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవిని భారీ మెజార్టీతో గెలిపించండి…
నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు రాములు ఢిల్లీలో టిఆర్ఎస్ అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగనాథ్
రంగారెడ్డి హైదరాబాద్ మహబూబ్ నగర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న సురభి వాణి దేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాగర్ కర్నూలు ఎంపీ రాములు, మాజీ ఎంపీ ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథ్ మాజీ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావులు పట్టభద్రులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణ ఏర్పాటులో భాగస్వాములు అవుతున్న టిఆర్ఎస్ అభిమానులు పట్టభద్రులు ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాల నేతలు ప్రజల కోసం పని చేస్తున్న సురభి వాణి దేవిని ఎమ్మెల్సీగా గెలిపిస్తేనే మనం అనుకున్న లభిస్తుందని నేతలు అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పట్టభద్రులతో నిర్వహించిన సభా సమావేశానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంపీ రాములు ఢిల్లీ అధికార ప్రతినిధి డాక్టర్ జగన్నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పట్టణంలోని మహబూబ్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పట్టభద్రులు ఓటర్లు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే విధంగా వారిని చైతన్యపరిచే ప్రజల కోసం చేస్తున్న వ్యక్తులను గెలిపించేందుకు ముందుకు వెళ్లాలని వారు సూచించారు.
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారత దేశం కోసం సేవ చేశారని గడ్డు పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిన వ్యక్తి గా మన్ననలు పొందిన పివి గారి కుమార్తె సురభి వాణి దేవిని గెలిపిస్తే మన ఆశయం గెలుస్తుందన్నారు.
తెలంగాణ కోసం ఢిల్లీలో, ఇటు రాష్ట్రంలో పోరాడి ముందు ఉండి నడిచిన తెలంగాణ బిడ్డలు అయిన మంద జగన్నాథ్, జూపల్లి కృష్ణారావు నేడు జరుగుతున్న ఎన్నికల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ లు ఈ శాసన మండలికి విద్యావంతురాలైన సురభీ వాణీదేవిని పంపాలనే ఉద్దేశంతో వారిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దించడం జరిగిందన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొల్లాపూర్ నియోజక నియోజకవర్గ ప్రాంతంలోని పట్టభద్రులైన ఓటర్లను టీఆర్ఎస్ అభ్యర్థికి తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి వ్యక్తి కృషిచేయాలని కోరారు.
ఈ దిశగా ప్రతి విద్యావంతుడు నిరుద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణి దేవితో ఫోన్లో మాట్లాడిన సంభాషణ కూడా విద్యావంతుల పట్టభద్రుల సమావేశంలో ఎంపీ రాములు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వినిపించడం జరిగింది.
సమావేశంలో సావిత్రిబాయి పూలే 124వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సమావేశంలో నేతలతో పాటు టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రమేష్ ధర్మతేజ జిల్లా గ్రంధాలయ చైర్మన్ నాగపురి విష్ణు పెద్దకొత్తపల్లి ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్ కోడేరు ఎంపీపీ రాధా జెడ్పిటిసి ఇంద్రకంటి వెంకటేష్ టిఆర్ఎస్ పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు నరసింహ శేఖర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ మార్కెట్ అధ్యక్షులు రామచంద్ర రెడ్డి గారు ఎంపీపీ హైమావతి మాజీ ఎంపీపీ గోవింద్ గారు పిఆర్టియు జిల్లా నాయకులు కృష్ణ రామచంద్ర రావు అర్జున్ గౌడ్ కొల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లు రమ్య కుమారి జ్యోతి శిరీష లక్ష్మి నయీమ్ బాలస్వామి ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు సులేమాన్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి నాయకులు పట్టభద్రులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు