చరిత్ర పునరావృతం కాకూడదనే అలా చేశా
1997వ సంవత్సరం ఆగస్టు 31, తన తల్లి డయానా (వేల్స్ యువరాణి) పాత్రికేయుల అత్యుత్సాహానికి బలైన రోజది.
అప్పట్లో దేశదేశాల్లో చర్చల్లో నిలిచిన విషాదం అది. రాచకుటుంబంలో సభ్యురాలు అవడం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాక ఆమె అందానికి తోడు ఫాషన్ పట్ల అమెకు గల ఆశక్తి అమెను ఫాషన్ ప్రపంచం ఒక ఐకాన్ లాగా చూసేలా చేసింది.
అంతేగాక ఆమెకు అనేక సందర్భాలలో మహారాణికి ప్రాతినిధ్యం వహిస్తూ అనేక కార్యక్రమాలలో హాజరయేవారు. కానీ 1990లలో ఆమె వ్యక్తిగత జీవితంలో మొదలైన అలజడులతో 1996లో తన భర్తతో విడాకులకు దారి తీశాయి.
అప్పటికే ఆమేపైనా అమె జీవితంపైనా ప్రపంచ వ్యాప్తంగా పత్రికా సంస్థల్లో ఆశక్తి బాగా ఎక్కువయింది.
ఎప్పుడూ పదుల సంఖ్యలో కెమెరాలు ఆమెను వెంటాడేవి. చివరకు ఆ కెమెరాల కళ్ళ నుండి తప్పించుకునే క్రమంలోనే ఆమే కారు ప్రమాదానికి గురవడంతో ఆమె తుది శ్వాశ విడిచారు. ఆమె రెండవ కుమారుడే ప్రిన్స్ హారీ.
ప్రస్తతం జరుగుతున్న పరిణామాలు కూడా దాదపూ ఆనాటి పరిస్థితులనే పునరావృత్తం చేసివగా ఉన్నట్లు భావించిన ప్రిన్స్ హారీ, చరిత్ర పునరావ్రుతం కాకూడదనే ఉద్దేశంతోనే సకల భోగాలనూ, విలాశాలను విడనాడి తన రాచరికపు వారసత్వాన్ని సైతం త్యజించి రాజకుటుంబానికి దూరంగా స్వేచ్ఛగా కాలిపోర్నియాలో తన భార్యతో ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
తాను రాచకుటుంబ వారసత్వాన్ని త్యజించడానికి గల కారణాలను ఇప్పుటి వరకూ బహర్గతం చేయని హారీ, త్వరలో ప్రశారం కానున్న ఒక టివి ఇంటర్వూలో ఈ సంచలనమైన విషయాలను బయటపెట్టినట్లు ఇటీవల విడదలైన ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను చూస్తే అర్ధమౌతుంది.
ప్రిన్స్ గా ఉన్న రోజుల్లో తనపై అనేక విధాల ఒత్తిడి ఉండేదనీ రాచకుటుంబం సంప్రదాయాలు వంశ మర్యాద కాపడటం అంత తేలికైన అశాలు కావని, ఆ బాధ్యతలకు తోడు ఎల్లప్పుడూ తనను తన భార్యను వెంటాడే కెమేరాలు ఎప్పుడు తన తల్లికి జరిగిన విషాధ సంఘటనను గుర్తు చేసేవని అవి తనను మానసికంగా అనేక విధల ఒత్తిడికి గురిచేసేవని, అందుకే చరిత్ర పునరావృతం కాకూడదనే ఉద్దేశంతోనే తాను తన వారసత్వావ్వాన్ని వదులుకోవలనే నిర్ణయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇప్పుడు తాను తన భార్యతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు, తనకు నచ్చిన జీవనశైలిని అవలంభించే స్వేచ్ఛ తనకు అందినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హారీ చేసిన వ్యాఖ్యలు మనకు తెలియాలంటే ఈ ఇంటర్వూ పూర్తి ప్రశారాలు ప్రశారమయ్యేవరకు మరిన్ని రోజులు వేచి ఉండాల్సిందే.