అభివృద్ధే మా నినాదం, ప్రభుత్వాన్ని గెలిపించి మనమూ గెలుద్దాం
గ్రాడ్యుయేట్లు విజ్ఞులు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం మనకు చేస్తున్న ద్రోహాలకు బుద్దిచెప్పాలి
ఎస్ వాణీదేవికి మెదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
పద్మారావునగర్ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్
సుస్థిరమైన పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు పద్మారావు నగర్ లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.

తప్పుడు మాటలు చెబుతూ, అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్న బిజెపిని నమ్మవద్దని కోరారు.
తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా ఇవ్వకుండా, విభజన చట్టం హామీలను కూడా తుంగలో తొక్కింది కేంద్రంలోని బీజేపీ సర్కార్ అని దుయ్యబట్టారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే లేని పథకాల్ని తెలంగాణ అమలు చేస్తుందని, సంక్షేమంతో పాటు అభివృద్ధిలో కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని పేర్కొన్నారు మంత్రి గంగుల.
ఈ అభివృద్ధికి ఊతమివ్వాల్సింది పోయి మొన్న ఐటీఐఆర్ నిన్న కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ నేడు జీఎస్టీ పరిహారం మొదలు మనకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఇవ్వకుండా బిజెపి సర్కార్ తెలంగాణ ను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు మంత్రి.
సంక్షోభ పరిస్థితుల్లోనూ నాడు పీవీ ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధి సాదించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని డిల్లీలో ప్రతిధ్వనించాడు, ఆ మహనీయునికి నివాళిగా పీవీ కూతుర్ని గెలిపించాలని కోరారు గంగుల.
133000 ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది అన్నారు.
సహేతుక విమర్శలు లేకుండా చిల్లర మల్లర మాటలతో బిజెపి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, విద్యాధికులు దాన్ని గమనించి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటును ఎస్ వాణిదేవి గారికి వేసి గెలిపించాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో మరో మంత్రి తలసాని మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు, విద్యాధికులు ఓటు వేయరనే అపవాదును తొలగించాలని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మొదటి ప్రాధాన్యత ఓటును ఎస్ వాణీదేవి గారికి వేసి గెలిపించాలని కోరారు మంత్రి తలసాని.
ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, స్థానికులు సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఎంప్లాయిస్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు