పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం…
మండపేటలో వైకాపాను ఆశీర్వదించండి..
రాణీ ప్రచారానికి విశేష స్పందన..
మండపేట:- పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా వైస్సార్ సిపి ప్రభుత్వం పని చేస్తుందని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్ర బోస్ పేర్కొన్నారు.
మండపేట వైకాపా చైర్మన్ అభ్యర్థి పతివాడ దుర్గా రాణి గెలుపు కోరుతూ ఆమె పోటీ చేస్తున్న 20 వ వార్డు గొల్లపుంత కాలనిలో బుధవారం ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
రాణి ప్రచారానికి ప్రజలు నుండి విశేష స్పందన లభించింది.
ఈ సందర్భంగా బోస్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో మండపేట ప్రజలు వైస్సార్ సిపిని ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కొమ్ము రాంబాబు, పతివాడ రమణ, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.