మైనారిటీల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి ముహమ్మద్ మహమూద్ అలి గారు పేర్కొన్నారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్లో, మైనారిటీల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మైనారిటీల అభివృద్దికై కేసిఆర్ గారు చిత్తశుద్దితో కృషి చేస్తున్నారు.
ముస్లింలకు పెద్ద పీట
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
అన్ని వర్గాలు అభివృద్ధి చెందితేనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు.
మైనార్టీల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అన్నారు.
మైనార్టీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు.
మంత్రి మాట్లాడుతూ పేదరికం తొలగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 210 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు.
పేద మైనార్టీ యువతుల పెళ్లిళ్ల కోసం షాదీముబారక్ పథకం ద్వారా రూ.100,116 ప్రభుత్వం అందజేస్తుందని చెప్పారు.
మైనార్టీల అభ్యున్నతి, వెనుకబాటుతనాన్ని తొలగించేందుకు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఉర్దూను తెలంగాణలో రెండో అధికార భాషగా గుర్తించామన్నారు.
మైనార్టీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంకు లింకేజీ లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే షూరిటీ ఇచ్చి స్వయం ఉపాధి రుణాలు ఇవ్వనుందన్నారు.
ముస్లిం మైనార్టీల పేదరికానికి కారణం 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనే అన్నారు.
అన్ని వర్గాలు బాగుంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, పిల్లలకు సన్నబియ్యంతో భోజనం, దేశంలో ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న ఏకైక సీఎం కేసీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ పాలనతో ముస్లింలకు గౌరవం పెరిగిందని, ముస్లిం మైనార్టీల పిల్లలు చదువుకునేందుకు ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేల రూపాయలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసి 210 పైచిలుకు పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు.
మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఏడేళ్లలో ఎంతో కృషి చేశారు.
రాష్ట్రంలో 91 వేల మంది మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మైనారిటీ విద్యా సంస్థల్లో అభ్యసిస్తున్నారు.
రైతుల కోసం 24 గంటల విద్యుత్, రైతు భీమా, రైతు బంధు అమలు చేస్తున్నారు
ఎన్నో ఏళ్ళగా మంత్రిగా పని చేసిన జానారెడ్డి నాగార్జునసాగర్ అభివృద్ది ఏమి చేయలేదు..పవర్ లో ఉన్నప్పుడే అభివృద్ది లేదు… ఇప్పుడు ఏం చేస్తారు.
రాష్ట్రంలోనే సాగర్ నియోజకవర్గ అభివృద్ధి వరస్ట్ గా ఉంది.
కావున నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తెరాస మైనారిటీ రాష్త్ర నాయకులు ముహమ్మద్ ఫహీముద్దిన్, షాది ఖాన చైర్మన్ హఫీజుద్దిన్ పాషా, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఫరీదుద్దిన్, త్రిపురం మైనారిటీ ఎన్నికల ఇంచార్జ్ అనీస్ ముక్తాదర్, మౌజం అలి, ఎండీ హబీబ్
తదితరులు పాల్గోన్నారు.