పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టిన :- రూరల్ సిఐ సతీష్
కంచికచర్ల మండలం కునికిన పాడు గ్రామంలో గురువారం రాత్రి నందిగామ రూరల్ సీఐ సతీష్ వారి సిబ్బందితో కలిసి పల్లెనిద్ర చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ మరియు నందిగామ డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కునికిన పాడు గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు.
రూరల్ పరిధిలోని కంచికచర్ల, వీరులపాడు, చందర్లపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయనట్లు వివరించారు.
ప్రజలు కూడా చైతన్యవంతులు అయ్యి పోలీసువారికి సహకరించారని, ఎటువంటి దాడులు ప్రతి దాడులు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
కాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని సమస్యాత్మకమైన గ్రామాల్లో అలజడులు సృష్టించే వారిని అదుపు చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు.
గురువారం రాత్రి కునికిన పాడు గ్రామంలో తాగునీరు పైప్ లైన్ విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఇక్కడకు చేరుకొని అదుపులోకి తీసుకు రావడం జరిగిందని తెలిపారు.
తదనంతరం గ్రామస్తులకు అవగాహన కల్పించమని తెలిపారు.
పల్లెలు అంటే ప్రశాంతతకు మారుపేరు అని, అలాంటి పల్లెలలో క్షణికావేశంతో ఒకరినొకరు ద్వేషించుకొంటూ, దాడులు ప్రతి దాడులకు దిగటం మంచి పద్ధతి కాదని, ఇటువంటి గొడవలను ప్రేరేపించే వారిని ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.