‘మా’ క్రమ శిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) క్రమ శిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
నరేష్ అధ్యక్షతన 2019 మార్చిలో ప్రస్తుత ప్యానల్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ ప్యానల్ పాలనా కాలం ముగిసింది.
ప్యానెల్ ఏర్పాటైనప్పుడు కొంత కాలం బాగానే ఉన్నా, తర్వాత ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ రెండుగా విడిపోయారు.
కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్ జయసుధ వంటివారు వీరిని కలపడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
‘మా’ డైరీ ఆవిష్కరణ సమయంలో నరేష్, రాజశేఖర్ మధ్య అభిప్రాయ బేదాలు మరోసారి బయటపడ్డాయి.
ఆ నేపథ్యంలో కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్‌బాబు, మురళీమోహన్ జయసుధలతో ఓ క్రమశిక్షణా సంఘం ఏర్పాటైంది.
కాాగా తాజాగా ఆ క్రమశిక్షణా సంఘానికి చిరంజీవి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.