అరకు నియోజికవర్గంలో గిరజన మహిళ దారుణ హత్య
విశాఖపట్నం జిల్లా అరకులోయ నియోజకవర్గం డుంబ్రిగూడ మండలం రంగిలి సింగి గ్రామ పంచాయితీలో ఒక గిరిజన మహిళా హత్య.
కిన్దర్ అనే వ్యక్తి భార్య అయిన పాంగి సీత వయస్సు 45 సంవత్సరములు, రంగిలిసింగి గ్రామములో మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఆ గ్రామానికి చెందిన పాంగి దామోదర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న నాటు తుపాకితో సీత వాళ్ళ ఇంట్లోకి వెళ్లి తను బియ్యం కడుగుతూ ఉండగా ఆమె నుదుటిపై గురిపెట్టి కాల్చి హత్య చేశాడు.
హత్య చేసిన వెంటనే ఆ వ్యక్తి పరారయ్యాడు అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు సైతం పరారయ్యారు.
విషయం తెలుసుకున్న సీత బంధువులు కోప ఉద్రేకాలతో చంపిన వ్యక్తి బంధువుల ఇళ్ల పై దాడికి దిగి సుమారుగా ఏడు ఇళ్లకు నిప్పంటించి పూర్తిగా ధ్వంసం చేశారు.
హత్యకు గల కారణాలు గత ఆరు సంవత్సరాలుగా భూ తగాదాలు జరుగుతూనే ఉన్నాయని ఆ ఊరి గ్రామస్తులు తెలుపుతున్నారు.
ఈ ఆరు సంవత్సరాల్లో భూ నమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ సంవత్సరము ఆ భూమికి సంబంధించి సాగు చేయడానికి చనిపోయిన సీత కుటుంబ సభ్యులు వరి నారు వేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న అవతల వ్యక్తులు కోపంతో నాటు తుపాకితో మహిళకు హత్య చేశారు.
గ్రామంలో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయని, ఈ భూ సమస్యలపై అధికారులకు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎమ్మార్వో గారికి పలు మార్లు ఫిర్యాదు చేసినా భూ సమస్య పరిష్కరించకపోవడం నిండు ప్రాణాలు పోతున్నాయని రంగిలిసింగి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇటువంటి భూ సమస్యలు చాలానే ఉన్నాయి ఈ సమస్యకి ఇరు వర్గాల నుండి పరిష్కరించి ఉంటే అమాయక గిరిజన ప్రాణాలు పోయి ఉండేవి కావు అని గ్రామస్తులు గగ్గోలు పెడుతున్నారు.
గ్రామంలో హింసాకాండ జరక్కుండా అమాయక గిరిజనులను చైతన్యపరిచి గ్రామంలో గల సమస్యలను పూర్తిస్థాయి విచారించి అమాయక గిరిజనులను కాపాడాలని రంగిలిసింగి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.