రాయపూర్: ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈనెల 9వ తేదీ నుంచి 10 రోజుల పాటు రాయపూర్ జిల్లాలో పూర్తి లాక్డౌన్ ప్రకటించారు.
9వ తేదీ రాత్రి 6 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 6 గంటల వరకూ పూర్తి కోవిడ్-19 కంటైన్మెంట్ జోన్ చర్యలు అమలు చేయనున్నట్టు జిల్లా యంత్రాగం తెలిపింది.
లాక్డౌన్ సమయంలో జిల్లా సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్టు రాయపూర్ జిల్లా కలెక్టర్ ఎస్.భారతి దాసన్ తెలిపారు.
కాగా, గత 24 గంటల్లో ఛత్తీస్గఢ్లో 9,921 కొత్త కేసులు నమోదు కాగా, 1,552 మంది కోలుకున్నారు. 53 మరణాలు సంభవించాయి.
దీంతో నమోదైన మొత్తం కేసులు 3,86,269కు చేరుకోగా, వీటిలో 52,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 3,29,408 మంది కోలుకున్నారు.
