దిల్లీ, కర్ణాటక, కేరళలోని 11 ప్రాంతాల్లో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. పాక్, ఐసిస్ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసింది.
దేశంలో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అప్రమత్తమైంది.
సోమవారం దేశ రాజధాని దిల్లీ సహా పలు ప్రాంతాల్లో సోదాలు జరిపింది.
దిల్లీ, కర్ణాటక, కేరళలోని 11 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఈ కుట్రకు సంబంధించి పాక్, ఐసిస్ ముఠాలతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సమాచారం.