168కిలోల పుష్పాలతో శ్వేతార్క గణపతికి జరిగిన పుష్పాభిషేకం
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని విష్ణుపురంలో గల స్వయంభు శ్రీ శ్వేతార్కమూల గణపతి దేవాలయ క్షేత్రంలో సంకటహర చతుర్థి సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీస్వామివారికి అంగరంగ వైభవంగా భక్తులచే సేకరించబడిన అనేక రకముల పుష్పములతో పుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది.
బ్రహ్మశ్రీ ఎల్లం భట్ల లక్ష్మణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ అభిషేక కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా హాజరై పూజలో పాల్గొన్నారు.
అయినవోలు రాధాకృష్ణశర్మ వేద మంత్రాలు చదవగా సాయి కృష్ణ శర్మ మరియు దేవాలయ అర్చక స్వాములు టం టం హరి స్వామి, వేణు స్వామి, మనోజ్ శర్మ, రోహిత్ శర్మ పాల్గొని అభిషేకం నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి వై హర్షవర్ధన్ అనే భక్తుడు 60 కిలోల పుష్పాలను అందించడం జరిగింది. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన ఈ అభిషేక కార్యక్రమం రాత్రి 10:30 వరకు కొనసాగింది.
పూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో దేవాలయ కార్యకర్తలు దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దేవాలయ కార్యకర్త సంకటహర చతుర్థి ఇన్చార్జి శోభ టీచర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందిపూజ అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గంగుల రాజిరెడ్డి దేవరకొండ రాము తదితరులు పాల్గొన్నారు. పుష్పాభిషేకం సందర్భంగా దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మరియు భక్తులు స్వయంగా పుష్పాభిషేకం నిర్వహించడానికి బారులు తీరారు.