ప్రభుత్వం పచారం తప్పితే అభివృద్దిని పట్టించుకోవటం లేదు – వేగుళ్ళ
ప్రచారమే తప్పా అభివృద్ది లేదు…
తిరోగమనంలో వైకాపా ప్రభుత్వం…
ప్రజా సంక్షేమం గాలికి వదిలేశారు…
ఎన్నికల ప్రచారంలో వేగుళ్ళకు బ్రహ్మరధం…
అడుగడుగునా జన నీరాజనం…
మండపేట:- గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోను అభివృద్ది పరిస్తే ప్రస్తుత వైకాపా ప్రభుత్వం పచారం తప్పితే అభివృద్దిని పట్టించుకోవటం లేదని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా మండపేటలోని 18, 25, 26 వార్డులలో ఎమ్మెల్యే వేగుళ్ళ ఇంటింట ప్రచారం నిర్వహించారు.
చైర్మన్ అభ్యర్ధి గడి సత్యవతి 18, 25, 26 వార్డుల కౌన్సిలర్లు సంకు మాధవిదేవి, అల్లక పద్మపోలరాజు, ఎలుబండి సత్యవతి లతో కలసి ఇంటింటా ప్రచారం చేశారు.
ఈ సంధర్బంగా ఆయా వార్డులలో ప్రజలు ఎమ్మెల్యే వేగుళ్ళకు బ్రహ్మరధం పట్టారు. ఆయనపై పూలవర్షం కురిపించారు. విజయహారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తామంతా టిడిపికి పట్టం కడతామని బరోసా ఇచ్చారు.
ఈ సంధర్బంగా వేగుళ్ళ మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. మండపేట పట్టణాన్ని అభివృద్ది చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణం చేపట్టి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. కుల, మత, వర్గ బేదాలు లేకుండా ఇక్కడి ప్రజలు అందరూ కలసిమెలసి ఉంటున్నారన్నారు.
ఇప్పుడు వలస నేతలు చిచ్చు పెట్టేందుకు కుతంత్రాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వీటన్నింటిని గమనిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు, నాయుడు రామమూర్తి, సంకు శివ, చింతా విజయ్ కుమార్, ఉండమాటి వాసు, మచ్చా నాగు, ఆకుల సత్యనారాయణ, ఈలి తాతాజి, వింజరపు శ్రీను, అల్లక గిరి, జంపా దొరబాబు, పెండ్యాల రవి, దుగ్గిరాల గనిరాజు, కోరా సతీష్, శీలం వెంకటేశ్వరరావు, నాయుడు వీరాస్వామి, బిళ్ళా భగవాన్, కోరాడ రాజు, దొంతంశెట్టి సురేష్, చింతా సాయిబాబు, చింతా రాజు, ముప్పన రాము, గోరు వీర్రాజు, ఆండ్ర శ్రీను, ఆండ్ర శివయ్య, ఎం.డి.ఆప్తాఫ్, పిల్లా గణపతి, బొచ్చా నరసింహమూర్తి, బొచ్చా కృష్ణ, ఎం.డి గయాస్, జొన్నపల్లి సూర్యారావు, పందిరి సూర్యారావు, పంతం రమణ, పేపకాయల నాగు, వంకా మణికంఠ, పి.సత్తిబాబు, పొనగంటి వెంకటరమణ, నామాల వెంకటరమణ, వెలుబండి సుబ్బారావు, పిల్లా రాంబాబు, కేతా సుబ్బారావు, కొనగంటి రాంబాబు, బొమ్మల హేమంత్ కుమార్, ముత్యాల వెంకట్రావు, నరాల వీర్రాఘవులు, మేడిశెట్టి శ్రీనివాసు, కుడుపూడి శ్రీను, నరాల వెంకటరమణ, మట్టా వీరవెంకట్రావు, బొజ్జా వెంకటేశ్వరరావు, బొజ్జా సుబ్బారావు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.